రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) 48వ వార్షిక సాధారణ సమావేశం (AGM)లో తన FY25 పనితీరు వివరాలను ప్రకటించింది. చైర్మన్ ముకేశ్ అంబానీ వివిధ వ్యాపార విభాగాల్లో భవిష్యత్ ప్రణాళికలను వివరించారు.
FY25 రికార్డు ఫలితాలు
-
మొత్తం ఆదాయం: ₹10,71,174 కోట్లు ($125.3 బిలియన్) – భారత్‌లో మొదటి కంపెనీగా $125 బిలియన్ వార్షిక ఆదాయం.
-
నికర లాభం: ₹81,309 కోట్లు ($9.5 బిలియన్).
-
EBITDA: ₹1,83,422 కోట్లు ($21.5 బిలియన్).
-
ఎగుమతులు: ₹2,83,719 కోట్లు ($33.2 బిలియన్) – దేశ ఎగుమతుల్లో 7.6%.
-
National Exchequer Contribution : ₹2,10,269 కోట్లు FY25లో మాత్రమే.
జియో – 500 మిలియన్ వినియోగదారులు, IPO 2026లో
-
జియో వినియోగదారులు 500 మిలియన్లు దాటారు.
-
FY25 ఆదాయం ₹1,28,218 కోట్లు ($15 బిలియన్) – 17% వృద్ధి.
-
EBITDA ₹64,170 కోట్లు ($7.5 బిలియన్).
-
జియో IPO 2026 మొదటిార్థంలో లిస్టింగ్ ప్రణాళిక.
-
భవిష్యత్ దిశలు: AI ఆధారిత సేవలు, స్మార్ట్ హోమ్ సొల్యూషన్లు, ఎంటర్ప్రైజ్ డిజిటలైజేషన్, అంతర్జాతీయ విస్తరణ.
-
కొత్త ఉత్పత్తులు: JioPC (క్లౌడ్ కంప్యూటర్), JioFrames (AI స్మార్ట్ గ్లాసెస్), JioAI Cloud, JioAirFiber.
రిటైల్ & FMCG
-
రిటైల్ FY25 ఆదాయం ₹3,30,943 కోట్లు ($38.7 బిలియన్).
-
EBITDA ₹25,094 కోట్లు ($2.9 బిలియన్).
-
2,659 కొత్త స్టోర్లు ప్రారంభం – మొత్తం 19,340 స్టోర్లు.
-
349 మిలియన్ కస్టమర్లు, FY25లో 1.4 బిలియన్ లావాదేవీలు.
-
RCPL (Reliance Consumer Products): మొదటి ఏడాదిలోనే ₹11,500 కోట్లు ($1.4 బిలియన్) ఆదాయం.
-
5 ఏళ్లలో ₹1 లక్ష కోట్లు ($11.7 బిలియన్) టార్గెట్.
మీడియా & ఎంటర్టైన్మెంట్
-
జియోస్టార్ (రిలయన్స్ + డిస్నీ భాగస్వామ్యం) ప్రారంభం.
-
జియోహాట్‌స్టార్: 3 నెలల్లోనే 600 మిలియన్ యూజర్లు, 300 మిలియన్ సబ్స్క్రైబర్లు – ప్రపంచంలో 2వ అతిపెద్ద స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాం.
-
నెట్వర్క్18: మనీకంట్రోల్ ప్రో 1 మిలియన్ యూజర్లు దాటింది(Paid subscribers); ఫస్ట్‌పోస్ట్ 400 మిలియన్ వీడియో వ్యూస్ సాధించింది.
ఎనర్జీ & న్యూ ఎనర్జీ
-
E&P బిజినెస్: దేశ గ్యాస్ ఉత్పత్తిలో 30% వాటా, EBITDA ₹21,188 కోట్లు.
-
ఆయిల్-టు-కెమికల్స్: ఆదాయం ₹6,26,921 కోట్లు ($73.4 బిలియన్); EBITDA ₹54,988 కోట్లు ($6.4 బిలియన్).
-
జామ్‌నగర్‌లో ధీరుభాయి అంబానీ గిగా ఎనర్జీ కాంప్లెక్స్ నిర్మాణం.
-
2032 నాటికి 3 MMTPA గ్రీన్ హైడ్రోజన్ లక్ష్యం.
-
20 GW సౌర ఉత్పత్తి సామర్థ్యం, 100 GWh బ్యాటరీ గిగా ఫ్యాక్టరీ, ఎలక్ట్రోలైజర్ ఫ్యాక్టరీ 2026లో ప్రారంభం.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ – Reliance Intelligence
-
కొత్త అనుబంధ సంస్థ Reliance Intelligence ప్రారంభం.
-
గూగుల్‌తో జామ్‌నగర్ AI క్లౌడ్ రీజియన్ భాగస్వామ్యం.
-
మెటాతో భారత ఫోకస్ AI జాయింట్ వెంచర్.
రిలయన్స్ ఫౌండేషన్
-
87 మిలియన్ భారతీయుల జీవితాలను ప్రభావితం చేసింది.
-
ముంబైలో 2,000 పడకల మెడికల్ సిటీ నిర్మాణం.
-
వంతారా – 1.5 లక్షల జంతువుల సంరక్షణ.
-
ముంబై ఇండియన్స్ 4 ఖండాల్లో 7 జట్లు, మొత్తం 13 టైటిల్స్ గెలుపు.
FY25లోని బలమైన ఫలితాలు మరియు AGMలో ప్రకటించిన కొత్త ప్రణాళికలు రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యాపార విస్తరణకు దిశానిర్ధేశం చేస్తున్నాయి. డిజిటల్ సేవలు, రిటైల్, FMCG, ఇంధన రంగాలు మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో పెట్టుబడులు సంస్థకు రాబోయే సంవత్సరాల్లో వృద్ధి అవకాశాలను మరింత బలోపేతం చేయనున్నాయి.