టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ (TPREL) మరియు టాటా పవర్ అనుబంధ సంస్థ అయిన TP Solar Limited (TP Solar) దేశీయంగా తయారైన 292.5 MWp సోలార్ మోడ్యూల్స్ సరఫరా కోసం సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (SECI) నుండి ఓ ప్రతిష్టాత్మక ఒప్పందాన్ని గెలుచుకుంది.
ఈ ప్రాజెక్ట్, CPSU స్కీమ్ ట్రాంచ్-III కింద SECI నిర్వహించిన 400 MWp టెండర్‌లో భాగంగా ఉంది. మొత్తం ₹632 కోట్ల విలువైన ఈ ఒప్పందం ప్రకారం, TP Solar ఆంధ్రప్రదేశ్‌లోని రామగిరి ప్రాంతానికి అధిక-నాణ్యత గల సోలార్ మోడ్యూల్స్‌ను అందించాల్సి ఉంటుంది. ఈ ఒప్పందం కోసం నిర్వహించిన పోటీ బిడ్డింగ్ ప్రక్రియలో e-రివర్స్ ఆక్షన్ కూడా చేపట్టబడింది, ఇందులో TP Solar 400 MWp మొత్తం పరిమాణంలో ప్రధాన భాగాన్ని సొంతం చేసుకుంది.
ఈ ఒప్పందం తో TP Solar తయారీ సామర్థ్యాన్ని పెంచటమే కాకుండా, దేశీయంగా తయారైన సోలార్ మోడ్యూల్స్‌ను ప్రోత్సహించడం ద్వారా భారతదేశ ‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్తుంది. ప్రాజెక్ట్ డెలివరీ అక్టోబర్ 2025 నుండి జనవరి 2026 మధ్య ముగించాల్సి ఉంటుంది.