అమరావతిలో భారతదేశపు మొదటి క్వాంటం వ్యాలీని అభివృద్ధి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో LTIMindtree భాగస్వామ్యం

ప్రపంచ స్థాయి టెక్నాలజీ కన్సల్టింగ్ మరియు డిజిటల్ సొల్యూషన్స్ కంపెనీ LTIMindtree, దాని పేరెంట్ సంస్థ లార్సన్ & టూబ్రో (L&T), ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, IBM మరియు ఇతర పరిశ్రమ భాగస్వాములతో కలిసి అమరావతి క్వాంటం వ్యాలీ నిర్మాణానికి చేతులు కలిపాయి. ఇది భారతదేశపు మొదటి క్వాంటం టెక్నాలజీ హబ్‌గా రూపుదిద్దుకోనుంది.

LTIMindtree క్వాంటం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) ఆధునిక పరిశోధన, ఆవిష్కరణలు, మరియు క్వాంటం సైన్స్‌ను పారిశ్రామిక, సామాజిక అవసరాలకు ఉపయోగపడే విధంగా మార్చడంపై దృష్టి పెడుతుంది. L&T ఈ ప్రాజెక్ట్‌కు అవసరమైన మౌలిక వసతుల డిజైన్, నిర్మాణం, నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తుంది.

ఈ ప్రాజెక్ట్‌లో క్వాంటం కంప్యూటింగ్ సెంటర్, ఇందులో IBM Quantum System Two ఏర్పాటు కానుంది — ఇది భారతదేశంలోనే అతిపెద్ద క్వాంటం కంప్యూటర్‌గా నిలుస్తుంది. ఈ అత్యాధునిక సాంకేతికత కోసం ప్రత్యేక నిర్మాణ అవసరాలను తీర్చడానికి L&T మరియు IBM కలిసి పనిచేస్తున్నాయి.

అమరావతి క్వాంటం వ్యాలీలో ఉండే సౌకర్యాలు:

  • క్వాంటం మరియు క్లాసికల్ కంప్యూటింగ్ కోసం ఆధునిక R&D కేంద్రాలు

  • విశ్వవిద్యాలయాలు, స్టార్టప్‌లు, పరిశ్రమ, ప్రభుత్వానికి షేర్‌డ్ వర్క్‌స్పేస్‌లు

  • సంస్థలు, పరిశోధనా బృందాల కోసం అనువైన కార్యాలయాలు

  • కాన్ఫరెన్స్‌లు, హ్యాకథాన్‌లు, వర్క్‌షాప్‌ల కోసం ఈవెంట్ స్పేస్‌లు

ఈ టెక్ పార్క్, విద్యాసంస్థలు, పరిశ్రమ, స్టార్టప్‌లు, ప్రభుత్వం కలిసి పనిచేసే వేదికగా నిలువనుండి

వేణు లంబు, CEO & MD, LTIMindtree : “అధునాతన కంప్యూటింగ్ ఆవిష్కరణలను కొత్త దిశగా తీసుకెళ్తోంది. మా క్వాంటం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా పరిశోధనను సమాజానికి, పరిశ్రమలకు ఉపయోగకరమైన పరిష్కారాలుగా మార్చడమే మా లక్ష్యం. అమరావతి క్వాంటం వ్యాలీ మరియు నేషనల్ క్వాంటం మిషన్‌కి మేము మద్దతు ఇస్తున్నాం.”

 

Share

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top