లార్సన్ అండ్ టూబ్రో (ఎల్‌అండ్‌టీ) యొక్క అనుబంధ సంస్థ అయిన ఎల్‌అండ్‌టీ ఎనర్జీ గ్రీన్‌టెక్ లిమిటెడ్ (LTEG) భారతదేశంలో అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్‌ను హర్యానాలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL) పానిపట్ రిఫైనరీలో ఏర్పాటు చేయనుంది.
ఈ ప్లాంట్‌ను బిల్డ్-ఓన్-ఆపరేట్ (BOO) విధానంలో నిర్మించనున్నారు. ఇది ప్రతి సంవత్సరం IOCL కు 10,000 టన్నుల గ్రీన్ హైడ్రోజన్‌ను 25 సంవత్సరాల పాటు సరఫరా చేయనుంది. ఇది భారత ప్రభుత్వం ప్రారంభించిన నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్కు తోడ్పాటుగా ఉంటుంది.
ఈ ప్లాంట్ 24 గంటలూ పునరుత్పత్తి విద్యుత్ ఆధారంగా పని చేస్తుంది. హై ప్రెషర్ ఆల్కలైన్ ఎలక్ట్రోలైజర్‌లతో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయనున్నారు, ఇవి గుజరాత్ రాష్ట్రం హజీరాలోని ఎల్‌అండ్‌టీ యూనిట్‌లో తయారవుతాయి. దీనివల్ల IOCL రిఫైనరీ కార్యకలాపాల్లో కార్బన్ ఉద్గారాలను తగ్గించుకోవచ్చు.
ఈ సందర్భంగా ఎల్‌అండ్‌టీ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ మరియు ప్రెసిడెంట్ శ్రీ సుబ్రహ్మణ్యం శర్మ మాట్లాడుతూ, ‘‘దేశ శుద్ధ ఇంధన మార్పును మేము ముందుండి నడిపించాలన్న దృష్టితో ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించాం. IOCLతో భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తూనే, పెద్ద స్థాయి క్లీన్ ఎనర్జీ పరిష్కారాల్ని అందించగల మా సామర్థ్యాన్ని ఇది నిరూపిస్తుంది’’ అన్నారు.
గ్రీన్ మానుఫ్యాక్చరింగ్ హెడ్ శ్రీ డెరిక్ షా మాట్లాడుతూ, ‘‘ఈ ప్రాజెక్ట్ మా గ్రీన్ ఎనర్జీ నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తుంది — ఎలక్ట్రోలైజర్ తయారీ నుండి ప్లాంట్ నిర్వహణ వరకు. స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో మేము ప్రపంచ స్థాయి పనితీరు కలిగిన ప్లాంట్‌ను అందించగలమన్న నమ్మకంతో ఉన్నాము. ఇది భారత్ యొక్క ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్తుంది’’ అన్నారు.